ఆంధ్రప్రదేశ్‌

ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్‌తో జాబ్ గ్యారంటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో 2016-17 విద్యాసంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించినట్టు సీపెట్ చీఫ్ మేనేజర్ కిరణ్‌కుమార్ తెలిపారు. గురువారం పిఐబి కాంప్లెక్స్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉన్న నాలుగు కోర్సులను తాము ఆఫర్ చేస్తున్నామని, ఈ నాలుగు కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ గ్యారంటీ అని ఆయన పేర్కొన్నారు. మార్కెట్‌లో గిరాకీ బాగా ఉన్నందున, ప్లాస్టిక్స్ రంగం అభివృద్ధి చెందుతున్నందున తమ సంస్థలో కోర్సు పూర్తి చేసిన వారందరికీ ఉద్యోగం వస్తోందని, మరికొంత మంది ఆసక్తితో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారుతున్నారని అన్నారు. చాలా మంది ఇంజనీరింగ్ చేస్తున్నా ఎక్కువ మంది ఉపాధిని వెతుక్కోవల్సి వస్తోందని, అయితే ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్‌లో మాత్రం చదువు పూర్తికాగానే ఉపాధి లేదా ఉద్యోగం గ్యారంటీ అని ఆయన వ్యాఖ్యానించారు.
గత కొద్ది బ్యాచ్‌లలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్, పోస్టు గ్రాడ్యూయేట్ డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ వౌల్డ్ డిజైన్ , డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ వౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నామని అన్నారు. ఇతర వివరాలకు సిఐపిఇటి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.