ఆంధ్రప్రదేశ్‌

సిఎం సొంత జిల్లాలో మాదిగలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 11: ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. వచ్చే నెల అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభకు సంబంధించి ఆదివారం చిత్తూరులో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నమ్మక ద్రోహి అని, మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా మాదిగలకు అన్యాయమే జరిగిందన్నారు.
మంద కృష్ణమాదిగ అరెస్ట్
ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను చిత్తూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి యాదమరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు జిల్లాలో పోలీసుల అనుమతి లేకుండానే సభలు నిర్వహిస్తున్నారన్న నెపంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చి తానే పెద్ద మాదిగనని సంక్షేమానికి పాటుపడుతానని తెలిపారని అన్నారు. అయితే నేడు అందుకు విరుద్ధం గా ప్రవర్తిస్తు మాదిగల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం చిత్తూరు నుంచి పుంగనూరులో జరిగే సన్నాహక సభకు బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని మంద కృష్ణమాదిగతో పాటు మరికొంత మంది ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి యాదమరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిత్తూరు జిల్లాలో పోలీసుల అనుమతి లేకుండానే ఈ సభలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, అందుకే అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.