ఆంధ్రప్రదేశ్‌

బాబు రాష్టప్రతి పదవికి యోగ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 11: ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్టప్రతి పదవికి యోగ్యుడని టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. ఆయన ఆ పదవికి పోటీ చేయాలని, ఆయన రాష్టప్రతి అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఇది తన అభిప్రాయమన్నారు. ప్రస్తుతం రాష్ట్భ్రావృద్ధిపై సిఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో రాష్టప్రతి పదవికి అభ్యర్థిగా బాబు పేరును టిజి వెంకటేష్ ప్రస్తావించడం వెనుక ఉన్న మర్మం ఏమిటో అర్థంకాని పరిస్థితిలో రాజకీయ పరిశీలకులు భిన్న కోణాల్లో విశే్లషిస్తున్నారు. చంద్రబాబు అనుమతి లేకుండానే టిజి వెంకటేష్ ఆయన పేరును రాష్టప్రతి పదవి కోసం ప్రస్తావిస్తారా అన్నకోణంలో కూడా రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు. ఆదివారం ఉద యం విరామ సమయంలో టిజి వెంకటేష్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశ ప్రథమ పౌరుడైన రాష్టప్రతి పదవికి చంద్రబాబు అన్నివిధాల యోగ్యుడన్నారు. చంద్రబాబుకు రాజ్యపాలనపైన, రాజకీయ, సామాజిక పరిస్థితులపై అపార అనుభవం, అవగాహన ఉందన్నారు. గతంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం వచ్చినా చంద్రబాబు వదులుకున్నారన్నారు. అలాగే ఆయన సిఫార్సు చేసి దేశంలో అనేకమందిని ప్రధానమంత్రులు, రాష్టప్రతులుగా ఎంపిక చేసిన చరిత్ర కూడా చంద్రబాబుది అని వివరించారు. రాష్ట్ర పాలనా బాధ్యతలను చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు అప్పగించి, ఆయన రాష్టప్రతి పదవి చేపట్టాలనేది తన అభిప్రాయమన్నారు. అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న సౌకర్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సౌకర్యాలంటే ఆగమ పండితుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయన్నారు. తనలాంటి రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు, మఠ పీఠాధిపతులకు ఎలాగైనా శ్రీవారి దర్శనం కలుగుతుందన్నారు. ఈక్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో సామాన్య భక్తులకు కూడా మంచి దర్శనం లభించేలా పండితులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యంతరాలు చెప్పేవారు మాత్రం తమకు అవసరమైన సమయాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగానే వినియోగించుకుంటున్నారని ఆయన చురక వేశారు. అందుకే తాను చెప్పేదేమిటంటే అనవసరపు అభ్యంతరాలను పక్కన పెట్టి సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాన్ని శుభ్రపరచుకోవడం, రోప్‌వే నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడం, తక్కువ సమయంలో స్వామి వారి దర్శనం వంటి వాటికి పండితు లు కూడా సహకరించాలని కోరారు. తద్వారా సామాన్య భక్తులకు మేలు చేసిన వారవుతారన్నారు.