ఆంధ్రప్రదేశ్‌

స్వరాజ్యం, సురాజ్యమే మోదీ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 11: స్వరాజ్యం సురాజ్యం కావాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ జనరంజక పాలన సాగిస్తున్నారని, అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే దిశగా మోదీ మూడేళ్ల పాలన పూర్తయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని మోదీ మూడేళ్ల పాలన విజయాలను వివరించేందుకు ఎన్‌బిసిసి ఆధ్వర్యంలో ‘సబ్‌కాసాథ్ - సబ్‌కా వికాస్’ పేరిట విశాఖలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాల్లో అభివృద్ధి, సంక్షేమం మాటల్లో మినహా చేతల్లో జరగలేదని, దారిద్య్ర నిర్మూలన కోసం అణగారిన వర్గాలను ఉద్ధరించే లక్ష్యంతో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని వివరించారు. జనధన్ యోజన ఖాతాలు, జన సురక్ష యోజన, చిరు వ్యాపారులకు ముద్ర రుణాలు, ప్రధాని ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బజావ్, బేటీ పడావ్, ప్రధాని ఫసల్ యోజన వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వీటితో పాటు దేశ సమగ్ర అభివృద్ధి చర్యల్లో భాగంగా వస్తు సేవల పన్ను విధానం, నల్లధనం నిర్మూలనకు నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలతో ప్రధాని మోదీ కీర్తి ఖండాంతరాలకు వ్యాపించిందన్నారు. నోట్ల రద్దుతో ఏం సాధించారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి వెంకయ్య తిప్పికొట్టారు. నోట్ల రద్దు అనంతరం రూ.15 లక్షల కోట్లు బ్యాంకులకు వచ్చి చేరాయన్నారు. బ్యాంకుల్లో జమ చేసిన ధనం ఎవరిదో వారి మూలాలేమిటో తేల్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నోట్ల రద్దు అనంతరం 91 లక్షల మంది కొత్తగా ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు. పెరుగుతున్న ఆదాయంతో ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతోందన్నారు. పెద్ద పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ పెద్దల రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శిస్తున్న వారు 2005 నుంచి 2013-14 సంవత్సరాల మధ్య ఆర్‌బిఐ లెక్కల ప్రకారం రూ.4,94,836 కోట్ల నిరర్ధక ఆస్తులు లెక్కగట్టగా, వీటిలో రూ.1,41,295 కోట్ల అప్పులు మాఫీ చేశారన్నారు. ఈ అప్పుల మాఫీ కాంగ్రెస్ అధికారంలో ఉండగానే జరిగిందన్న వాస్తవాన్ని విస్మరించి విమర్శలు చేయడం ప్రజలు గమనించాలన్నారు. విపక్షాలు ఎంత ప్రయాసపడినా, మోదీకి ప్రజాదరణ తగ్గదని, భవిష్యత్‌లో కూడా ప్రధానిగా మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చిన్న ప్రాంతాలకూ విమానయాన సేవలను విస్తరించేందుకు ‘ఉడాన్’ పథకం ద్వారా దేశంలో 50 ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు వెల్లడించారు. అలాగే 2022 నాటికి అందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు తక్కువ వడ్డీకి గృహ రుణాలను ఇస్తున్నామన్నారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వ పాలనా విజయాలను ప్రజలకు వివరించాలన్న ప్రధాని ఆదేశం మేరకు సబ్‌కాసాథ్-సబ్‌కావికాస్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న స్వచ్ఛ భారత్‌లో అవార్డులు దక్కించుకున్న జివిఎంసి, విశాఖ పోర్టుట్రస్టు, విశాఖ రైల్వే డివిజన్ అధికారులు హరినారాయణన్, ఎంటి కృష్ణబాబు, మాధుర్‌లను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సత్కరించారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు