ఆంధ్రప్రదేశ్‌

ఎపి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును బోర్డు అధికారులు శుక్రవారం నాడు ప్రకటించారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 2వ తేదీ నుండి 6వ తేదీ వరకూ జరుగుతాయని, ఎథిక్స్ -హుమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 7న జరుగుతుందని చెప్పారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 8న జరుగుతుంది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం మే 24 నుండి జరుగుతాయి. ఉదయం 9 నుండి 12 వరకూ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. 24న సెకండ్ లాంగ్వేజి, 25న ఇంగ్లీషు, 26న మాథ్స్ మొదటి పేపర్ , బోటనీ, సివిక్స్, సైకాలజీ, 27న మాథ్స్ రెండో పేపర్, జువాలజీ, హిస్టరీ, 28న ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజి, మే 30న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్, మే 31న జియాలజీ, హోం సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జికోర్సు , జూన్ 1న మోడరన్ లాంగ్వేజి, జియాలజీ పరీక్షలు జరుగుతాయి. ఉదయం పూట జరిగిన సబ్జెక్టులే రెండో పూట సెకండియర్ విద్యార్ధులకు సైతం ఉంటాయి.