ఆంధ్రప్రదేశ్‌

తిరుపతి కార్పొరేషన్ వెబ్‌సైట్ హ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 29: తిరుపతి నగరపాలక సంస్థ వెబ్‌సైట్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హ్యాకింగ్‌కు గురైంది. హ్యాక్ చేసిన వ్యక్తి బంగ్లాదేశీయుడిగా గుర్తించారు. తాము ముస్లిములమని, ఉగ్రవాదులు కాదని డార్క్‌డైమెండ్ పేరుతో జహీర్‌ఖాన్ అనే వ్యక్తి ఒక సందేశాన్ని పెట్టాడు. ఊహించని ఈ పరిణామానికి నగరపాలక సంస్థ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఈ విషయాన్ని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్‌జెట్టి దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ విభాగం సిబ్బంది దీనిపై దృష్టి సారించి హ్యాకింగ్ ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వెబ్ డిజైన్ చేసిన గుత్తేదారుపై కూడా దృష్టిపెట్టారు. అయితే ఈ వెబ్‌సైట్ ప్రజలు చూసుకునేందుకు వీలుగా తిరుపతి అభివృద్ధి, కుల, మతాల వారీగా ఓటర్ల వివరాలు మాత్రమే ఉన్నాయని, ఇందులో రహస్య సమాచారం ఏమీలేదని నగరపాలక సంస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు. నగరపాలక సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన జహీర్‌ఖాన్ ఢాకాలోని ఓ సైబర్ సంస్థకు డిప్యూటీ సిఇవోగా పనిచేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై కమిషనర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ గతంలో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించిన గుత్తాదారు కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నామని, సురక్షిత వెబ్‌సైట్‌ను రూపొందిస్తామని చెప్పారు. కాగా ఈ వెబ్‌సైట్‌ను విజయవాడకు చెందిన ఓ వెబ్‌సైట్ సంస్థ రూపొందించిందని, అయితే వారికి బిల్లులు చెల్లించకపోవడంతో వారు అర్థాంతరంగా తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదేమైనా నగరపాలక సంస్థ వెబ్‌సైట్ హ్యాకింగ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.