ఆంధ్రప్రదేశ్‌

రైల్వే స్టేషన్లలో పటిష్ఠ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: భారత రైల్వే శాఖ పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో కనీస అవసరాల ఏర్పాట్లు చేపట్టింది. తాగునీరు, మరుగు దొడ్లు, ప్లాట్ ఫాంల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. అదేవిధంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో తప్పిపోయిన, పారిపోయిన, అక్రమ రవాణాదారుల చేతిలో చిక్కిన చిన్నారులను కాపాడడం, ప్రయాణికుల భద్రత వంటి చర్యలను చేపట్టిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు భద్రత కల్పించడంతోపాటు చిన్నారులను కాపాడడంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ముందంజలో ఉందని ఆర్‌పిఎఫ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఏడాది దాదాపు ఏడు వేలమంది చిన్నారులను కాపాడినట్టు ఆయన పేర్కొన్నారు.
జనవరి నెలలోనే 890 మంది పిల్లలను ఆర్‌పిఎఫ్ కాపాడిందని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. ఇదిలావుండగా రైల్వే మంత్రిత్వ శాఖ, మహిళ, శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ, నేషనల్ కమిషన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంయుక్తంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేశాయి. పిల్లల అక్రమ రవాణాను అరికట్టాలని, తప్పిపోయిన పిల్లలను కాపాడేందుకు ఆర్‌పిఎఫ్ పటిష్ఠ చర్యలు చేపట్టి, దేశంలోని 20 ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అమలు చేస్తున్నారు. వీటిలో న్యూఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్, ముంబయి, హౌరా, రాంచీ, చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్, లక్నో, గౌహతి, బెంగళూరు సిటీ, పాట్నా, వారణాసి, సికిందరాబాద్, నాగ్‌పూర్ తదితర స్టేషన్లలో అమలు చేస్తున్నారు.