ఆంధ్రప్రదేశ్‌

ప్రోటోకాల్ నిబంధనపై ఎమ్మెల్యే కిలివేటి నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లకూరు, ఏప్రిల్ 29: బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆయన స్ఫూర్తితో విద్యనభ్యసించిన తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తున్న తన పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు వివక్ష చూపడం సహేతుకం కాదని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరులో శుక్రవారం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పాటించడం లేదంటూ ఎమ్మెల్యే స్థానిక ఎంపిపి కె సత్యనారాయణతో కలసి మంత్రి సభావేదిక ముందు నేలపై బైఠాయించారు. ఈ సందర్భంగా వేదిక వద్ద కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్యను ఎమ్మెల్సీ వాకాటి, మంత్రి నారాయణ వేదికపైకి రావాలని సముదాయించారు. ఎమ్మెల్యే తన పట్టును వీడలేదు. దళిత ఎమ్మెల్యేనని తనను అవమానిస్తున్నారని వాపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం దళిత ఎమ్మెల్యేలకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు. మంత్రి జోక్యం చేసుకొని ఎమ్మెల్యే మాట్లాడే తీరు సరిగా లేదంటూ మంత్రిగా తాను స్వయంగా ఆహ్వానిస్తున్నానని, అధికారుల పొరపాటుకు చింతిస్తున్నానని ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మొండి వైఖరిని అర్థం చేసుకొన్న మంత్రి ఒక మెట్టుదిగి చివరకు వేదికపై ప్రొటోకాల్ నిబంధన పాటిస్తున్నట్టు ప్రకటించగా ఆయన శాంతించి వేదికపై ఆశీనులయ్యారు.