రాష్ట్రీయం

ఎపి సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం నాడు స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ బ్లాక్ రెండో అంతస్తులో షార్టుసర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట దట్టమైన నల్లటి పొగలు చుట్టుముట్టి మంటలు రేగాయి. అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేశారు. శుక్రవారం మధ్యాహ్నం అదే బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో దేవుడి పటాల వద్ద కాగితాలకు దీపం అంటుకుని మంటలు చెలరేగాయి. వెంటనే వాటిని కూడా సిబ్బంది ఆర్పివేశారు. ఒక పక్క అగ్నిప్రమాదం సంభవించిన సమయంలోనే బాత్‌రూమ్‌లో సూట్‌కేస్ ఉందని తెలియడంతో ఆందోళన నెలకొంది. పోలీసులు దానిని తెరిచి చూశారు. అందులో కాగితాలు మాత్రమే ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు.
గతంలోనూ అగ్నిప్రమాదాలు, కొన్నిమార్లు పాత రికార్డులు తగులబెట్టడం వంటి సంఘటనలు సచివాలయంలో జరగడం షరామామూలుగా మారింది.