రాష్ట్రీయం

మోతుగూడెంలో విద్యుత్ ఉత్పత్తికి బ్రేకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 2: సీలేరు జలాలపై ఆధారపడిన తూర్పు గోదావరి జిల్లాలోని మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో నేటి నుండి ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. నీటి కొరత కారణంగా విద్యుదుత్పత్తికి బ్రేకు పడింది. మంగళవారం నుండి 12 రోజులపాటు విద్యుదుత్పత్తి నిలుపుదలచేస్తూ జెన్‌కో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నీటి లభ్యత లేకపోవడంతో ఇప్పటికే గత నాలుగు రోజులుగా ఇదే జిల్లాలోని డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. నీటి లభ్యత లేని కారణంగా మోతుగూడెంలో 2నుండి 3 మిలియన్ యూనిట్లకు పడిపోయిన విద్యుదుత్పత్తి సోమవారం మరింత గడ్డు పరిస్థితి ఎదురుకావడంతో 0.25 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఎగువ సీలేరు నుండి డొంకరాయికి నీరందని స్థితిలో ఉత్పత్తి పునరుద్ధరణ ఎప్పుడు చేపడతారో అర్ధం కానిపరిస్థితి. మోతుగూడెంలో విద్యుదుత్పత్తి నిలుపుదల చేస్తూ తీసుకున్న పనె్నండు రోజుల కాల వ్యవధిలో ప్రధాన కాలువ పూడికతీత, మరమ్మతులు వంటి పనులు చేపట్టేందుకు జెన్‌కో అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వేసవి దృష్ట్యా ఎక్కడైనా పీక్ స్టేజ్ వస్తే అత్యవసర స్థితిలో మోతుగూడెం ఉత్పత్తిచేసే విధంగా కూడా అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏదేమైనా ఇటు పుష్కర నీటి వినియోగం, ప్రస్తుత నీటి ఎద్దడి వెరసి మోతుగూడెంలో ఉత్పత్తికి బ్రేకు పడిందని తెలుస్తోంది.