రాష్ట్రీయం

సీమలో మండిపోతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/కర్నూలు/అనంతపురం, మే 2: రాయలసీమ జిల్లాల్లో సోమవారం కూడా ఎండల తీవ్రత కొనసాగింది. అయితే ఆదివారం రాత్రి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. కడప నగరంలో సోమవారం 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 42.2, నంద్యాలలో 41.8, ఆదోనిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు జిల్లా కేంద్రంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. శింగనమలలో 47.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు తేలికపాటి వర్షం కురిసింది. డి హీరేహళ్, బ్రహ్మసముద్రం, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, హిందూపురం, మడకశిర, తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.