ఆంధ్రప్రదేశ్‌

బికాం, బిటెక్ డాక్టర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 20: బికాం, బిటెక్ చదివిన బావబావమరుదులు డాక్టర్ల అవతారమెత్తారు. నకిలీ డాక్టర్ పట్టా సంపాదించి ఏకంగా కార్పొరేట్ ఆసుపత్రులు నిర్మించి చిన్నారులు, అమాయక ప్రజల ప్రాణాలకు వైద్యం చేసి వారి ప్రాణాలతో ఆడుకున్నారు. చివరకు విజిలెన్స్ అధికారులకు చిక్కి కటకటాలపాలయ్యారు. మంగళవారం కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జరిపిన దాడులతో ఈ మాయగాళ్ల అసలు రంగు బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన నరేంద్రప్రసాద్ బికాం చదివాడు. అతని బావమరిది రాఘవేంద్ర బిటెక్ పాసయ్యాడు. వీరిద్దరూ కలిసి డబ్బు సంపాదించాలన్న ధ్యేయంతో ఎంబిబిఎస్ నకిలీ పట్టాలు తెచ్చుకుని 2015లో ప్రైవేటు ఆసుపత్రులు నిర్మించారు.
నరేంద్రప్రసాద్ కర్నూలు కొత్తబస్టాండ్ సమీపంలో జెపి చిల్డ్రన్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుచేయగా, అతని బావమరిది రాఘవేంద్ర ఆదోనిలో విజయగౌరీ హాస్పిటల్ నిర్వహిస్తున్నాడు. ఆసుపత్రులకు స్పెషల్ డాక్టర్లను పిలిపించి రోగులకు వైద్యం చేయించేవారు. స్కానింగ్, ఎక్స్‌రే, ఆపరేషన్ థియేటర్లు ఆసుపత్రుల్లోనే ఏర్పాటుచేయించి రోగులకు అన్ని పరీక్షలు అక్కడే నిర్వహిస్తున్నారు. ఒక్కోసారి వైద్యులు రాని సమయంలో వీరిద్దరే రోగులకు స్కానింగ్ చేయించి, ఎక్స్‌రే తీయించి ఏవో మందులు రాసేవారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు సిబ్బందితో కలిసి మంగళవారం కర్నూలు, ఆదోనిలోని ఆసుపత్రులపై దాడులు జరిపారు. సోదాల్లో వీరిద్దరి నకిలీ డాక్టర్ పట్టాలు లభించాయి. దీంతో ఆసుపత్రులు సీజ్ చేశారు. నకిలీ డాక్టర్లు ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు.