ఆంధ్రప్రదేశ్‌

సుబాబుల్ రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: రాష్ట్రంలోని సుబాబుల్ రైతులను ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటరీ స్థాయి టిడిపి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబాబుల్ రైతులు దాదాపు 300 మంది లోకేష్‌ను కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి తప్పకుండా ఆదుకుంటామని తెలిపారు. ఒకదశలో టిడిపి నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. తాము పెట్టుబడులు పెట్టి డబ్బులు కోసం తిరుగుతున్నామని, తమ బాధ ఏమి తెలుసుంటూ రైతులు విమర్శించారు. మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదని, 10 కోట్ల రూపాయల బకాయలు ఉన్నాయని, డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ సహకరించటం లేదని కొంతమంది ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ మంత్రి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ టెండర్లు కావాలని రద్దు చేస్తున్నారని మేయర్ తెలిపారు. దీనిపై స్పందించిన లోకేష్.. కమిషనర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును తొలగించటంపై ప్రశ్నించగా ఆ విషయంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రవాణాశాఖలో అవినీతి గురించి ఎంపి కేశినేని నాని విమర్శలు చేస్తున్న నేపధ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమంటూ వ్యాఖ్యానించారు.