ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ సమాజం అంటే ప్రభుత్వానికి చులకన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: బ్రాహ్మణ సామాజికవర్గం అంటే ప్రభుత్వానికి చులకనభావం అని విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు విమర్శించారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును అకారణంగా పదవి నుంచి తప్పించి, బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి తన ప్రేమను చాటుకున్నారని ఎద్దేవా చేశారు. కనీస వివరణ తీసుకోకుండా తొలగించడం నీతి నిజాయితీని సమాధి చేసేందుకేనని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక, రవాణా మాఫియాలు పేట్రేగిపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి లేరన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. నగరాభివృద్ధి చేస్తారని టిడిపికి ప్రజలు పట్టం కడితే 8వేల ఇళ్లు కట్టలేమని వెనక్కి పంపిన ఘనత ప్రస్తుత పాలకులకే చెందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించి, నివాసానికి సిద్ధంగా ఉన్న 4వేల ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము పెట్టిన 20 అంశాలతో కూడిన ఛార్జ్‌షీటుపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. పిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని, నకిలీ విత్తనాలు అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు. పట్టిసీమతో కృష్ణాడెల్టాకు ఉపయోగం లేదని, పులిచింతలను పూర్తిచేయాలని ఆయన కోరారు. ఎటువంటి వివరణ అడగకుండానే అగౌరవంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును పదవి నుండి తప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కెవిపి రామచంద్రరావు, తదితర నాయకులు ఈనెల 22వ తేదీన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను కలిసి విశాఖ భూకుంభకోణంపై విచారణకు ఆదేశించాలని కోరనున్నట్లు తెలిపారు. 23వ తేదీన కిర్లంపూడి వెళ్లి ముద్రగడ పద్మనాభంను కలిసి ఆయన చేసే పోరాటానికి మద్దతు తెలపనున్నట్లు తెలిపారు.