ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రుల్లో ‘మహాప్రస్థానా’నికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినవారి మృతదేహాలను గౌరవప్రదంగా వారి ఇళ్లకు తరలించడానికి ప్రభుత్వం మహాప్రస్థానం కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లో ఉన్న పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆన్‌లైన్‌లో మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రజారోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందుకోసం ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. తాజాగా మహాప్రస్థానం పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతూ, దురదృష్టవశాత్తూ అనారోగ్యం వల్ల ఎందరో మృత్యువాత పడుతున్నారన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాల తరలింపు మరింత భారంగా మారుతోందన్నారు. మృతదేహాలను తీసుకెళ్లడానికి ప్రైవేటు వాహనాల యజమానులు రూ.10వేల నుంచి రూ.15వేల వరకూ డిమాండ్ చేస్తున్నారన్నారు. దీనివల్ల పేదల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందన్నారు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా చోటుచేసుకోకూడదనే ఉద్దేశంతో సిఎం చంద్రబాబునాయుడు మహాప్రస్థానం పథకానికి శ్రీకారం చుట్టాలని ఆదేశించారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినవారి మృతదేహాలను ఎయిర్ కండిషన్ వాహనం ద్వారా సొంతిళ్లకు తరలించాలన్నది మహాప్రస్థానం ఉద్దేశమన్నారు. తొలుత గుంటూరు ఆసుపత్రిలో ఐదు వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. దీంతోపాటు రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో 50 వాహనాలతో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ నాలుగైదు ఆసుపత్రులకు పెంచుతూ, రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మృతదేహాలకు సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ పూలదండ వేసి, గౌరవంగా మహాప్రస్థానం వాహనం ద్వారా మృతుల బంధువుల ఇళ్లకు తరలిస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహాప్రస్థానం కార్యక్రమం అమలుచేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందన్నారు.
సిఎం సమక్షంలో రెండు ఎంవోయులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో మంగళవారం రెండు ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. టాటా కన్సల్టెన్సీ, సెన్నార్ గ్రూపుతో ఎంవోయులు కుదుర్చుకున్నామన్నారు. నెల్లూరు, కర్నూలుతో పాటు విశాఖలోని విమ్స్‌లో క్యాన్సర్ యూనిట్లకు టెక్నాలజీ సహకారమందించడానికి టాటా కన్సల్టెంట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. సెన్నార్ గ్రూప్‌తో మెడికల్ డేటా టెక్నాలజీ అందివ్వడానికి మరో ఒప్పందం సిఎం చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్నామన్నారు.
చిత్రం.. మాట్లాడుతున్న మంత్రి కామినేని