ఆంధ్రప్రదేశ్‌

పాఠశాలలు పునఃప్రారంభమైనా కొలిక్కిరాని ఉపాధ్యాయుల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఉపాధ్యాయుల బదిలీలు ముగియకపోగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు నేటికీ ఓ కొలిక్కి రాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా 61వేల 528 పాఠశాలల్లో పనిచేసే లక్షా 88వేల మంది ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనికి తగ్గట్లుగా ఉపాధ్యాయులు రోడ్డెక్కిన ప్రతిసారీ ప్రభుత్వం ఒక్కో సవరణతో జీవో జారీ చేస్తున్నది. ఇప్పటికి పాఠశాలల రేషనలైజేషన్‌కు సంబంధించి మూడు జీవోలు, టీచర్ల బదిలీలకు సంబంధించి 31, 32, 38 నెంబర్లతో మరో మూడు జీవోలు జారీ అయ్యాయి. ఈ బదిలీలకు సంబంధించి తొలిసారిగా మే 1వ తేదీన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకు మరోసారి సమావేశమై వీరితో చర్చించకపోవటం గమనార్హం. మంత్రి పట్టించుకోవటం లేదు కదాఅని ఇతర ఉన్నతాధికారులెవరూ ఇందులో జోక్యం చేసుకోటం లేదు. ప్రధానంగా వెబ్ కౌనె్సలింగ్, ప్రతిభాధారిత బదిలీల విధానాన్ని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఆన్‌లైన్ విధానం అమల్లో ఉన్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. విద్యాశాఖ ప్రకటించిన సీనియార్టీ జాబితా ప్రకారం రోజుకు 500 మంది టీచర్లు కౌనె్సలింగ్ సెంటర్‌కు వచ్చి ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని తక్షణం బదిలీ ఉత్తర్వు చేతబట్టుకుని వెళ్లేవారు. ప్రస్తుతం ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఖాళీకి కూడా ప్రయార్టీ ప్రకారం వరుస సంఖ్య ఇవ్వాల్సి ఉంది. ఉదాహరణకు నాలుగైదువేల ఖాళీలు ఉంటే ఏ ప్రదేశం ఎలాంటిదో.. అక్కడ తమ పిల్లల, కుటుంబ అవసరాలేంటో తెలియక తొలి 500 ప్రదేశాలను గుర్తించి మిగిలిన ఖాళీలన్నింటికీ ఒకే ఒక పదం ‘సెలెక్ట్’ అని పేర్కొనాల్సి వస్తున్నది. దీనివల్ల ఎవరికి ఏ ప్రదేశంలో పోస్ట్ వస్తుందో తెలియని స్థితి... అసలు ప్రతిభాధారిత పాయింట్లపై బదిలీలను ఉపాధ్యాయ సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా గుర్తింపులేని సంఘాల నేతలతో అధికారులు సమావేశమై 50 పాయింట్లను 40 శాతంకు తగ్గించినట్లు ప్రకటించడంపై యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులకు గతంలో 10 పాయింట్లు ఉంటే ఐదుకు తగ్గించి తిరిగి మరో పాయింట్ చేర్చారు. భార్యాభర్తలకు సంబంధించి గతంలో ఉన్న పది పాయింట్లను ఐదుకు తగ్గించి మళ్లీ ఒకటి పెంచారు. ఏజెన్సీ ప్రాంతాలను కోరుకునేవారికి కొత్తగా మూడు పాయింట్లు చేర్చారు. అయితే సమీప ప్రాంతాల్లోని వారు మినహా మరెవరూ ఆ ప్రాంతాలను కోరుకోరు.
అసలు బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు కూడా ఎంతో లోపభూయిష్టంగా కన్పిస్తున్నాయి. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 90 శాతం హాజరు ఉంటే రెండు పాయింట్లు, 80 శాతం వరకు అయితే ఒక పాయింట్ కూడా ప్రధానోపాధ్యాయునికే దక్కుతుంది. చిన్న చిన్న పాఠశాలల్లో ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటే హెచ్‌ఎం పోస్టు ఉండదు. బాధ్యులెవరైనా సెలవులో ఉంటే ఇతర ఉపాధ్యాయులే హాజరు విషయాన్ని ఎంఇవోలకు మెసేజ్ రూపంలో తెలియచేయాల్సి ఉంది. వాస్తవానికి ఉపాధ్యాయులందరూ పర్యవేక్షిస్తుంటారు. ఎంతో శ్రమించే టీచర్లను.. తప్పించుకుని తిరిగే టీచర్లను ఒకే గాటికి కట్టివేస్తున్నారు. కొత్తగా 10 నుంచి 20 శాతం విద్యార్థులు చేరితే ఆరు పాయింట్లు వరకు లభిస్తాయి. చిన్న పాఠశాలల్లో 30 మంది లోపు ఉంటే ఐదారుగురు చేరితే చాలు అదే 200 మంది పిల్లలు ఉన్నచోట 40 మందికి తగ్గితే ఒక్క పాయింట్ కూడా రాదు.. ఇక డ్రాప్‌అవుట్స్‌కు సంబంధించి కూడా సరైన విధానం లేదు. ఏది ఏమైనా ఉపాధ్యాయుల బదిలీలు కొలిక్కి వస్తే గాని పిల్లల చదువులు పట్టాలెక్కేలా కన్పించడం లేదు.