ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్య అధ్యక్షునిగా పాలుశెట్టి బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తానని రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్య అధ్యక్షుడు కొండూరు పాలుశెట్టి అన్నారు. మత్స్య సహకార సమాఖ్య అధ్యక్షునిగా గురువారం బాధ్యతలు చేపట్టిన తరువాత సచివాలయం నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో చైర్మన్‌గా నియమించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 13 జిల్లాల్లోని మత్స్యకారులందరికీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానానికి అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని పాలుశెట్టి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, అడిషనల్ కమిషనర్ సీతారామరాజు, మత్స్యకార సంఘాల జాతీయ అధ్యక్షుడు అనంత నగేష్‌బాబు, ఫైనాన్షియల్ అడ్వైజర్ అరుణ్‌బాబు అభినందనలు తెలిపారు.