ఆంధ్రప్రదేశ్‌

రుణమాఫీ ఫ్యాషన్ కాదు.. అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: రుణామాఫీ అన్నది ఫ్యాషన్ కాదని, అవసరమని రాష్ట్ర ఆర్థిక యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రుణమాఫీ ఫ్యాషన్‌గా మారిందని ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి యనమల పై విధంగా స్పందించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం యనమల విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు వ్యాఖ్యల గురించి విలేఖరులు ప్రశ్నించగా, దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రం రైతులకు రుణమాఫీ అమలు చేసిందని గుర్తు చేశారు. ఎన్టీయే ప్రభుత్వ హయాంలో కూడా ఎన్టీఆర్ అమలు చేశారని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ అన్నది తెలుగుదేశం పార్టీ విధానంలో భాగమని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేసిన తరువాత దీనిని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేశారని, యుపి ఎన్నికల్లో ప్రధాని కూడా ప్రకటించారన్నారు.