ఆంధ్రప్రదేశ్‌

మేనేజర్ల వ్యవస్థ రద్దు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 23: ఏ కార్యాలయం చూసినా ఒక అధికారి, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బంది ఉంటారు. వాళ్లకి జీతం, ఇతర భత్యాలు అ అధికారి ఆధ్వర్యంలో, ఆయా శాఖలు అందిస్తుంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ వ్యవస్థల్లో సాధారణంగా ఇదే తీరు దర్శనమిస్తుంది. కానీ దేవుడి వ్యవహారాలు చూసే దేవాదాయ ధర్మాదాయ శాఖలో మాత్రం చాలామంది ఉద్యోగులు, అర్చకులు, సిబ్బందికి జీతభత్యాల విషయంలో దేవుడే దిక్కు అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. ఈ విభాగంలో రకరకాల వ్యవస్థలు సమాంతరంగా నడిచిపోతుంటాయి. అప్పటి అవసరాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ ప్రకారం కొంతమందిని నియమించటం, వారి జీతభత్యాల విషయానికొస్తే ఏదో ఒకరకంగా సర్దుబాటు చేయటం జరుగుతుంది. రాజకీయ జోక్యం, స్థానిక అవసరాల మేరకు రకరకాల నియామకాలు జరిగిపోయాయి. చివరకు ఇవన్నీ కలిసి ముడిమీద ముడి పడి ఈ శాఖలో మొత్తం పీటముడి పడినట్లుగా తయారైంది. పదిమంది పనిచేస్తుంటే అందులో కొంతమందికి ట్రజరీ నుంచి, మరికొందరికి ఆలయం నుంచి, మిగిలినవారికి సిజిఎఫ్ నుండి ఇలా రకరకాల విధానాల్లో జీతభత్యాలు చెల్లించే వ్యవస్థ ఈ ఒక్క శాఖలోనే కొనసాగుతోంది. ఇలాంటి ఆస్తవ్యస్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలోనే రాష్టవ్య్రాప్తంగా కొన్ని ఆలయాల్లో కొనసాగుతున్న మేనేజర్ల వ్యవస్థను రద్దుచేయడానికి సన్నాహాలు పూర్తయినట్టు సమాచారం. వీరందరినీ మొదట్లో ఎక్కడ పనిచేసేవారో అదే స్థానానికి పంపేయాలని నిర్ణయించారు. ఈవిధంగా జరిగితే ప్రస్తుతం గ్రూపు దేవాలయాలకు మేనేజర్లుగా పనిచేస్తున్న దాదాపు 86మంది ఉద్యోగంలో చేరిన తొలిదశలో ఏ ఆలయంలో పనిచేశారో అక్కడకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎన్నో ఏళ్ల క్రితం ఏదో ఒక అలయంలో పనిచేసి అక్కడ నుంచి గ్రూపు ఆలయాలకు వర్గోన్నతి చెంది, ఇఓలతో సమానంగా బాధ్యతలు నిర్వర్తించిన వీరు మళ్లీ యథాస్థానాలకు వెళ్లాలి. అయితే వీరి పాత స్థానాల్లో మరొకర్ని నియమించేశారు. ఇప్పుడు వీరు వెనక్కి వెళ్లితే అక్కడ ఉన్నవారి పక్కనే మరో కుర్చీ వేసుకుని కూర్చోవాల్సి ఉంటుంది. ఇద్దరికీ జీతం ఇచ్చే పరిస్థితి లేక మొత్తానికి వారంతా రోడ్డున పడే అగత్యాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాకాకుండా వీరికి ప్రత్యామ్నాయం చూపే ప్రయత్నం ఒకవిధంగా జరిగినా దానిలోనూ ఉన్నతాధికారుల మధ్య ఉన్న అంతరం ఆ ప్రయత్నాన్ని కూడా నిర్వీర్యం చేసిందనే చెప్పాలి. ఒక ఉన్నతాధికారి 107 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో మేనేజర్లను సర్దుబాటు చేయాలని మెమో జారీచేస్తే, మరో అధికారిణి జివో ఇస్తేనే ఆ నిర్ణయానికి విలువ ఉంటుందని మెమోను పక్కనపెట్టేయటంతో వీరు త్రిశంకుస్వర్గంలో ఉన్నారు. చివరకు ఆశాఖ మంత్రి కూడా ఈ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఉన్నతాధికారుల మధ్య అంతరం కారణంగా పరిస్థితిలో మార్పురాలేదని తెలుస్తోంది. చివరకు మేనేజర్లను తొలగించే నిర్ణయం అమలైతే ఇంతకాలం వీరు చూసిన గ్రూపు ఆలయాలను ప్రస్తుతం 20, 30 ఆలయాలను చూస్తున్న ఇఓలకే జత చేయాల్సివుంటుంది. ఆ విధంగా ఒక్కొ ఇఓ సరాసరిన 50 ఆలయాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఆలయాల ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతూ వస్తుండగా వాటిని పరిరక్షించే ప్రయత్నాలన్నీ బలహీనంగా జరుగుతున్న నేపథ్యంలో ఇన్ని ఆలయాలను పర్యవేక్షించటం అంటే ఒక అధికారి వల్ల అసాధ్యమనే చెప్పాలి. ఎప్పుడో టిడిపి హయాంలో మంత్రిగా పనిచేసిన దండు శివరామరాజు దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు కొనసాగడానికి అనువుగా మేనేజర్ల వ్యవస్థను ప్రవేశపెడితే ఇప్పుడు అదే ప్రభుత్వ హయాంలో దీనికి మంగళం పాడాలన్న నిర్ణయం వెలువడే పరిస్ధితి రావటం విచారకరమనే చెప్పాలి. ఈనేపథ్యంలోనే దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలో ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులను ఏకీకృత సర్వీసులోకి తీసుకురావాలన్న డిమాండ్ బలంగా విన్పిస్తోంది. ఏకీకృతం చేసి ట్రజరీ ద్వారానే జీతాలు చెల్లిస్తే శాఖలో జవాబుదారీతనం పెరగడమే కాకుండా ఉద్యోగుల జీవితాలకు కూడా భద్రత ఏర్పడుతుందన్న డిమాండ్‌తో పలు విభాగాల ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికే ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా తమ ప్రధాన డిమాండ్‌ను ప్రభుత్వానికి స్పష్టం చేసేందుకు జూలై 6వ తేదీన చలో కమిషనరేట్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆలయాల సంఖ్య తగ్గినందున ఈవ్యవస్ధను ఒక గాడిలో పెట్టే ప్రయత్నం ఇప్పటికైనా మొదలవ్వాలన్న డిమాండ్ గట్టిగా విన్పిస్తోంది.