రాష్ట్రీయం

అన్ని స్కూళ్లలో వ్యాయామ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుండి వ్యాయామ విద్యను తప్పనిసరి చేస్తున్నామని కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఇప్పటికే పాఠ్యాంశాల రూపకల్పన పూర్తయిందని, ప్రతి పాఠశాలలోనూ వ్యాయామ విద్యను బోధించేందుకు ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు లేనిచోట్ల ఇతర ఉపాధ్యాయులు ఈ అంశాన్ని బోధించేలా వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
మొదటి దశలో 600 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు నాగార్జున వర్శిటీ ప్రాంగణంలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. గోపీచంద్ అకాడమీతో పాటు కెనడాకు చెందిన స్పోర్ట్స్ ఫర్ లైఫ్ అనే సంస్థ సహకారంతో ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం గుంటూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, పాఠశాలల్లో చదువుకునే బాలబాలికలను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ కోర్సును ప్రవేశపెడుతోందని సంధ్యారాణి వివరించారు.