ఆంధ్రప్రదేశ్‌

ముస్లింలకు ముఖ్యమంత్రి రంజాన్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: రాష్టవ్య్రాప్తంగా ఈదుల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల కోసం తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 లక్షల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించామన్నారు. ప్రతి ముస్లిం సోదరుడు ఆనందోత్సాహాల మధ్య ఈదుల్ ఫితర్‌ను జరుపుకోవాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదర, సోదరీమణులకు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు రంజాన్ పర్వదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ ప్రసన్నత కోసం ముస్లింలు చేసిన ఉపవాస దీక్షలు శాంతియుత సమాజం కోసం పరస్పర సోదరభావం పెంపొందించి తెలుగు ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, ఎపి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్, తదితరులు కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ముస్లిం సమాజానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో రంజాన్ పర్వదిన శుభకాంక్షలు తెలిపారు. మానవాళికి సద్బుద్ధిని ప్రబోధించడానికి దివ్య ఖురాన్ అవతరించిన మాసం ఇదని అన్నారు. ఖురాన్ ప్రవచించిన శాంతి, సహనం, దయ, సేవాతత్పరత, దాన గుణాలను సమాజంలో ప్రతిఒక్కరూ ఆచరిస్తే సుఖసంతోషాలు పరిఢవిల్లుతాయన్నారు.