ఆంధ్రప్రదేశ్‌

అంతుచిక్కని మరణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి/ రంపచోడవరం, జూన్ 25: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం వై రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో గత కొద్ది రోజులుగా గిరిజనులు అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో మృతిచెందుతున్నారు. గత 20 రోజుల నుండి 16 మంది జ్వరాలు, వాంతులు, విరేచనాలతో మృత్యువాతపడ్డారు. అయితే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం కావడంతో ఆలస్యంగా ఈ మరణాల వ్యవహారం వెలుగుచూసింది. శనివారం రాత్రి వెలుగులోకి రావడంతో అధికార్లు హుటాహుటిన గ్రామానికి చేరుకుని, సహాయక చర్యలు చేపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. వివరాలిలావున్నాయి... గత నెల 29న గ్రామంలో జరిగిన ఒక వివాహ వేడుకలో మాంసాహారం భుజించిన పలువురు అస్వస్థతకు గురువుతున్నారు. అప్పటి నుండి ఒకొక్కరుగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 16మంది మృతిచెందారు. మృతుల్లో పల్లాల రత్నకుమారి(6), పల్లాల రామ్‌చరణ్‌రెడ్డి(2), కొండ్ల విజయలక్ష్మి(3), సాదల సంజీవరెడ్డి(35), చెదల శేఖర్‌రెడ్డి(30), పల్లాల లింగారెడ్డి(20), పల్లాల బొ రంరెడ్డి(28), పల్లాల తమ్మిరెడ్డి (70), పల్లాల చిట్టంరెడ్డి(40), పల్లాల సన్యాసిరెడ్డి(40), పల్లాల కన్నపురెడ్డి (45), బచ్చెల రాజబాబురెడ్డి, మరో వృద్ధు డు, కొండ్ల తారమ్మ (70), పల్లాల అమ్మమ్మ (21), పల్లాల చీమమ్మ (60), మరో వృద్ధుడు ఉన్నారు. కాగా అస్వస్థతకు గురైనవారు వైద్య సౌకర్యం లేక, గ్రామంలోని భూతవైద్యులను ఆశ్రయించడంతో మరణాలకు అడ్డుకట్టలేకపోయింది. శనివారం నాటికి ఈ సమాచారం బాహ్యప్రపంచానికి తెలియడంతో రంపచోడవరం ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ సహా పలువురు వైద్యాధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ రత్నాబాయి, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, డిఎంహెచ్‌ఒ చంద్రయ్య, డిసిహెచ్ రమేష్ తదితరులు గ్రామాన్ని సందర్శించారు. అస్వస్థతకు గురైన 21 మంది గిరిజనులను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మారేడుమిల్లి పిహెచ్‌సిలో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదివారం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. చాపరాయి గ్రామానికి మూడు వైద్య బృందాలను పంపించామని, 15 మందిని మెరుగైన వైద్యం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామని ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ చెప్పారు. మెరుగైన వైద్యం అందించడానికి కాకినాడ నుండి ప్రత్యేక వైద్య సిబ్బందిని తరలించామని, వ్యాధి తీవ్రతను బట్టి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రెండు 108వాహనాలను, ఐటిడిఎ అంబులెన్సులను తరలించామన్నా రు. చాపరాయిలో మరణాలపై ము ఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీశారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రాతో మాట్లాడారు. తక్షణం గిరిజనులకు అవసరమైన అన్నిరకాల వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

చిత్రం.. రంపచోడవరంలో చికిత్స పొందుతున్న చాపరాయి గ్రామస్తులు