ఆంధ్రప్రదేశ్‌

సహకరించమంటే బెదిరించడమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు నెరవేర్చాం కాబట్టే తెలుగుదేశం పార్టీకి సహకరించమని ప్రజలను అడగటంలో తప్పేమిటని, అది బెదిరించడమెలా అవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చడంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పేదల సంక్షేమం కోసం ఏటా రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా, పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులను శరవేగంతో నిర్మిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయడం చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రిపై వైకాపా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కర్నూలులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బెదిరింపులుగా చూపి రాజకీయం చేయడం సరికాదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై అపార గౌరవం ఉందని, జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ఉన్నత స్థానం కలిగిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఎన్నో నేరాలకు, ఘోరాలకు పాల్పడి నాయకుడిగా రాష్టస్థ్రాయిలో గుర్తింపు కోసం నానాపాట్లు పడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఏవిధంగా నేరాలకు పాల్పడ్డాడో, ఎంపిగా ఉంటూ రాజ్యాంగ వ్యవస్థలను ఏవిధంగా ధ్వంసం చేశారో సిబిఐ, ఈడీ పెట్టిన 12 ఛార్జిషీట్లే రుజువులన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేస్తేనే తనకు భవిష్యత్తు ఉంటుందనే కుతంత్రంతో జగన్మోహన్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ ఉదంతం, కృష్ణా జిల్లా కలెక్టర్‌పై దౌర్జన్యం జగన్ స్వభావానికి నిదర్శనాలన్నారు. న్యాయమూర్తులపై అసభ్య కథనాలను ప్రోత్సహించిన జగన్ న్యాయవ్యవస్థపై ధర్మపన్నాలను వల్లిస్తున్నారన్నారు. మంత్రివర్గంలో అసంతృప్తి ఉన్నట్లు ఒక సెక్షన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛ మంత్రులకు ఉందన్నారు. కొన్ని నిర్ణయాలను మంత్రులు శాఖాపరంగా తీసుకుంటారన్నారు. మరికొన్నింటికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. నాయకుడు తన బృందానికి దిశానిర్దేశం చేయడం ప్రజాస్వామ్యంలో ప్రధానాంశమని, అది నియంతృత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు తమ నాయకుడని, ఆయన సూచనలు పాటించడం మంత్రుల బాధ్యతన్నారు. అందులో తప్పేమిటో ఆ సెక్షన్ మీడియాకే తెలియాలన్నారు. రాష్ట్ర మంత్రి మండలికి, కార్యనిర్వహణ వ్యవస్థకు మధ్య పూర్తి సమన్వయం ఉందని, మూడేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, అవార్డులే అందుకు నిదర్శనమన్నారు. అధికార యంత్రాంగానికి మంత్రి మండలికి మధ్య అంతరం ఉన్నట్లు మీడియాలో దుష్ప్రచారం చేయడం హేమయమని అన్నారు. తీవ్ర ఆర్థిక లోటులోనూ ఇంత పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమంకోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి కనీస సహకారం ఇవ్వకుండా బురద జల్లడం బాధాకరమన్నారు.