ఆంధ్రప్రదేశ్‌

అయ్యప్పకు కామినేని అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 26: బిజెపికి చెందిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అయ్యప్పస్వామి దీక్షను అవమానించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు.
హిందుత్వాన్ని భుజాన వేసుకునే బిజెపికి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి కామినేని ఇటీవల జరిపిన శబరిమలై పర్యటన సోషల్ మీడియాలో వచ్చిన ఫొటో పుణ్యాన వివాదమయింది.
శబరిమలై వెళ్లిన ఆయన డోలీలో నున్నగా గడ్డం చేసుకుని కాళ్ళకు చెప్పులు వేసుకు కూర్చుని ఉన్న ఉన్న ఫొటో ఒకటి గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయ్యప్పదీక్ష నియమావళి ప్రకారం కాళ్లకు చెప్పులు వేసుకోవడం, గడ్డం చేసుకోవడం నిషిద్ధం. అయినా ఆయన ఆ రెండు నియమాలను ఉల్లంఘించిన వైనాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.
హిందుత్వం, ఆచారాలు, సంస్కృతి గురించి మాట్లాడే బిజెపి నేతలు దీనికేం సమాధానం చెబుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పదిమందికీ ఆచార వ్యవహారాలు చెప్పే బిజెపి నేతలే వాటిని ఉల్లంఘిస్తే, ఇక వాటిపై మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుందన్న ప్రశ్నలు సంధించారు.

చిత్రం.. కాళ్లకు చెప్పులతో డోలీలో కూర్చున్న కామినేని