ఆంధ్రప్రదేశ్‌

కుప్పం వైసిపి నాయకులు టిడిపిలో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని గోదివిమాకుల్లపల్లి గ్రామం పంద్యాల మడుగు పంచాయితీకి చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపాకు చెందిన వీరంతా ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం మార్కెట్ యార్డు డైరెక్టర్ కృష్ణా నాయక్ ఆధ్వర్యంలో వీరందరూ ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. రామకుప్పం మండలం టిడిపి అధ్యక్షుడు సి.ఆంజనేయరెడ్డి, కార్యదర్శి టి.నారాయణ, జడ్పీటిసి మునిస్వామి, బెంగుళూరు రాజన్న వీరితో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి కండువా కప్పి వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టిడిపిలోకి రావడం అభినందనీయమని తెలిపారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ సదుపాయం, చంద్రన్న బీమా, అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్లు, తదితర కార్యక్రమాలను నిర్విఘ్నంగా చేస్తున్నామన్నారు.

చిత్రం.. టిడిపిలో చేరిన కుప్పం వైకాపా నాయకులు