ఆంధ్రప్రదేశ్‌

అమరావతి ఇటుక అటకెక్కింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 27: అమరావతి ఇటుకకు బేరాలు కుదరటంలేదు. రాజధాని నిర్మాణానికి నేనుసైతం అంటూ ప్రజలందరినీ భాగస్వాములు చేసేందుకు 2015 అక్టోబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్ ద్వారా నా ఇటుక- నా అమరావతి పేరిట ఇటుకల బుకింగ్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఒక్కో ఇటుకకు రూ. 10 ధర నిర్ణయించారు. అప్పట్లో ఇటుకలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం ఇటుకలను బుక్ చేశారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. దీనిపై రూ. ఐదు కోట్లకు పైగా ఆదాయం కూడా వచ్చింది.. రాజధాని ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) నిర్వహణలో ఆన్‌లైన్ ద్వారా రోజుకు ఎవరెవరు.. ఎన్ని ఇటుకలు కొనుగోలు చేశారో డిస్ ప్లే కూడా ఏర్పాటు చేశారు. సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు. అయితే ఇప్పటి వరకు 2లక్షల 26వేల 952 మంది 56లక్షల 62వేల 473 ఇటుకలు కొనుగోలు చేసినట్లు సీఆర్‌డిఎ వెబ్‌సైట్ చూపుతోంది.. దీనిపై అప్పట్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు స్పందించి లక్షలాది ఇటుకలపై బాలయ్య చిత్రంతో ముద్రిస్తున్నట్లు ప్రకటించారు. కాగా సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లో ఏడాది కాలానికి పైగా తేదీ మారుతోంది తప్ప ఇటుకల బేరం కదలటంలేదు. రాజధాని భవనాలన్నీ సింగపూర్ తరహాలోప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్లతో నిర్మితమవుతున్న నేపథ్యంలో అమరావతి ఇటుకలను సిఆర్‌డిఎ అధికారులు విస్మరించారనే విమర్శలు తలెత్తుతున్నాయి. అమరావతి ఇమేజిని ప్రపంచ వ్యాప్తం చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా అమలుచేస్తున్న ఇటుక అమ్మకాలకు మంత్రులు, ఎమ్మెల్యేలే స్పందించలేదంటే అతిశయోక్తి కాదు. అధికార పార్టీకి చెందిన నేతలు కూడా దీన్ని విస్మరించారు. దీంతో ప్రజల్లో ఆసక్తి తగ్గింది. రాజధాని శంకుస్థాపనకు పవిత్రజలాలు, మట్టిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి తీసుకువచ్చిన ఉత్సాహం నిర్మాణంపై కనిపించటంలేదనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. అసలు అమరావతి ఇటుక ఎక్కడ తయారు చేయిస్తారు. ఎన్ని లక్షల ఇటుకలకు ఇప్పటి వరకు ఆర్డర్ ఇచ్చారు.. మున్ముందు ప్రజలను ఎలా జాగృతం చేయనున్నారనే విషయాలపై స్పష్టతలేదు.