ఆంధ్రప్రదేశ్‌

ఫిర్యాదు నమోదు అంటే రుణం తిరస్కరించినట్టు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: భూసమీకరణలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాల్ని కాపాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిర్దేశించుకున్న సమయానికి పూర్తి చేస్తామని ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు పూర్తి విశ్వాసంతో, సన్నద్ధతతో ఎపిసిఆర్‌డిఎ ఉందని ఆయన పేర్కొన్నారు. గత మే నెల 25, 27 తేదీల్లో కొద్దిమంది రైతులు భూసమీకరణ విధానం తమకు హాని కల్గిస్తుందనే ఆరోపణలతో పంపిన నివేదికను తాము ఈ నెల 12న రిజిష్టర్ చేసుకున్నామని ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం తెలిపిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఫిర్యాదు నమోదు చేయటం అంటే రుణం తిరస్కరించినట్టుగా భావించరాదన్నారు. ఈ నివేదికను నమోదు చేయటం అంటే, వారి నివేదికలో కోరిన అంశాల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా భావించరాదని తెలిపారు. తనిఖీ బృందం కేవలం తన వెబ్‌సైట్‌లో నమోదు చేసిందన్నారు. ప్రపంచ బ్యాంకు నియమ నిబంధనలు, విధానాలకు అనుగుణంగా రుణ మంజూరు అవుతున్నదీ లేనిదీ అంచనా వేసే తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీని నిర్వహించాల్సిందిగా అక్టోబర్ 8న కొద్దిమంది రైతులు లేఖ రాశారన్నారు. దరఖాస్తుదారులు ఆరోపించిన హాని అనే అంశాన్ని ప్రాజెక్టు తొలిదశలో అంగీకరించకపోవడంతో నమోదు చేయడం లేదంటూ తనిఖీ బృందం గత డిసెంబర్ 19న రాసిన లేఖలో వెల్లడించిందన్నారు. తనిఖీ కోరుతూ కొందరు రాసిన లేఖలో ప్రధానంగా భూ సమీకరణ విధానం, పునరావాస ప్రణాళిక, ఆహార భద్రత, పర్యావరణం అంశాలున్నాయని అన్నారు. 15 మంది నిపుణులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందం 2016 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సిఆర్‌డిఎ కార్యాలయాన్ని, ప్రాజెక్టు ప్రాంతాన్ని 4 సార్లు సందర్శించిందన్నారు. ప్రాజెక్టు అప్రయిజల్ డాక్యుమెంట్ (పిఎడి)ను రూపొందించేందుకు, ప్రాజెక్టులో పేర్కొన్న అంశాలు, సామాజిక, పర్యావరణ అంశాలు, ప్రాజెక్టు అమలు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై చిన్న బృందాలుగా ఏర్పడి స్వతంత్రంగా మదింపు చేసిందన్నారు. ఇవి కాకుండా ప్రపంచ బ్యాంకు డాక్యుమెంటేషన్‌ను నిర్ధారించేందుకు మూడో పార్టీతో అధ్యయనం చేయించిందన్నారు. రాజధాని నిర్మాణంలో సబ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక అంశాలపై ఎపిసిఆర్‌డిఎ ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని శ్రీధర్ తెలిపారు.