ఆంధ్రప్రదేశ్‌

2019 ఎన్నికల సమరం ప్రణాళిక ఖరారు చేయనున్న వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: వచ్చే జూలై 8,9 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్య జరిగే వైకాపా ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్ల నుంచి కార్యకర్తల వరకు సమన్వయంతో పనిచేయాలని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చేందుకు వీలుగా ప్రణాళికను ఖరారు చేస్తామని చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయన పార్టీ నేతలతో ప్లీనరీ సమావేశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మూడేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టేందుకు ప్లీనరీ సమావేశాల్లో పార్టీ కార్యకర్తలకు దిశ, దశ మార్గనిర్దేశనం చేయనున్నట్లు చెప్పారు. నేతలు, కార్యకర్తలు ఇక దూకుడుపెంచాలని, చంద్రబాబు ప్రభుత్వ స్కాంలను జనానికి వివరించాలన్నారు. ప్లీనరీలో ప్రవేశపెట్టే తీర్మానాల ముసాయిదాను కూడా ఆయన పార్టీ సీనియర్లతో చర్చించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు.