ఆంధ్రప్రదేశ్‌

టిడిపి నేత తోటలో వన్యప్రాణుల వధ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 2: వన్యప్రాణులను హతమార్చి మాంసం విక్రయాలు చేపడుతుండగా సమాచారం అందుకున్న నిమ్మనపల్లె పోలీసులు, మదనపల్లె అటవీశాఖ అధికారులు ఆదివారం వేకువజామున దాడులు నిర్వహించారు. వన్యప్రాణులను చంపి వాటి మాంసాన్ని శుభ్రం చేస్తుండగా అటవీశాఖ అధికారులు, పోలీసుల రాకతో దుండగులు పరారయ్యారు. మామిడితోటలో లభించిన 75 కిలోల అడవిపంది మాంసం, 7 ద్విచక్రవాహనాలు, వేటకొడవళ్లు, నాటు తుపాకులను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె పంచాయతీ గొల్లపల్లె సమీపంలో తెలుగుదేశం పార్టీ నేత వెంకటేష్‌కు చెందిన మామిడితోటకు అతి సమీపంలో అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడి వాటిని తోటలో వధించి ఆ మాంసాన్ని మదనపల్లె పట్టణంలో విక్రయిస్తున్నట్లు బయటపడింది. తోటలో పెద్దఎత్తున అడవిపందుల మాంసం ఉండగా దానిని స్వాధీనం చేసుకున్నారు. ప్రతి శనివారం రాత్రి కొంతమంది మామిడితోట నుంచి అటవీ ప్రాంతంలోకి కరెంటు తీగలను ఏర్పాటు చేసి వేట ద్వారా లభించిన వన్యప్రాణులను హతమార్చి వాటి మాంసాన్ని ఆదివారం విక్రయించేవారు. ఈ తంతు గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో ఆదివారం వేకువజామున ఆకస్మింగా దాడులు నిర్వహించగా నిందితులు పరారయ్యారు. పట్టుబడిన ఏడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని వాటి ద్వారా విచారణ చేపట్టినట్లు మదనపల్లె అటవీశాఖ అధికారి మాదవరావు విలేఖరులకు వెల్లడించారు. ఈ దాడులలో సబ్ డిఎఫ్‌ఓ ధర్మరాజు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం.. స్వాధీనం చేసుకున్న వన్యప్రాణుల మాంసంతో అటవీ శాఖ అధికారులు