ఆంధ్రప్రదేశ్‌

జలాశయంలో స్నానానికి దిగి ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, జూలై 2: విశాఖ జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామంలోని పెద్దేరు జలాశయంలోని ఎడమ కాలువలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నంలోని వరల్డ్ నెట్ సర్వీసు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న పది మంది యువకులు విహార యాత్రకు ఆదివారం పెద్దేరు జలాశయానికి వచ్చారు. జలాశయం పక్కనే మావోలమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన ఉన్న ఎడమ కాలువలోకి స్నానం చేసేందుకు ముగ్గురు యువకులు దిగారు. కాలువలోకి దిగిన వీరు క్షణాల్లోనే నీటిలో మునిగిపోతూ పెద్దఎత్తున కేకలు వేశారు. స్థానికులు వీరిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విశాఖ నగరంలోని పెదగంట్యాడకు చెందిన అరుసుమిల్లి దిలీప్(28), అరకులోయ మండలం సుంకరమెట్ట గ్రామానికి చెందిన నాని(26), మహారాష్టల్రోని పుణేకు చెందిన దత్తాత్రేయ(28) దుర్మరణం పాలయ్యారు. తమ స్నేహితులు తమ కళ్లేదుటే విగతజీవులుగా మారడంతో తోటి స్నేహితులు బోరున విలపిస్తున్నారు. సంఘటనను తెలుసుకున్న అనకాపల్లి ఇన్‌చార్జి డిఎస్‌పిఎన్ వర్మ, చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు, మాడుగుల ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను వెలికితీసి శవ పంచనామా కోసం విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డిఎస్‌పి వర్మ విలేఖరులకు తెలిపారు.