ఆంధ్రప్రదేశ్‌

పట్టణీకరణ కోసం జిఒఎం : యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 2: అభివృద్ధికి అర్బనైజేషన్ (పట్టణీకరణ) చాలా కీలకమని, ఒక ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసమే అర్బనైజేషన్‌కు ఇటు రాష్ట్రం, అటు కేంద్రం కూడా ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అర్బనైజేషన్ కోసం ప్రభుత్వం జిఒఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఏర్పాటుచేసిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ (గుడా) ఛైర్మన్ గన్ని కృష్ణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అర్బనైజేషన్ 80 శాతం ఉండగా, మన రాష్ట్రంలో మాత్రం 2001-2011 గణాంకాల ప్రకారం కేవలం 2 శాతమే ఉందని, అందుకే జిఒఎంను ఏర్పాటుచేసి, అర్బనైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్, కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్సీలు వివివి చౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.