ఆంధ్రప్రదేశ్‌

దేశ రక్షణ కోసం జనజాగరణ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 2: దేశ రక్షణ కోసం డిసెంబర్ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో జనజాగరణ ఉద్యమం చేపడుతున్నామని ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహప్రచార ప్రముఖ్ బయ్యా వాసు ప్రకటించారు. భారత్‌ను ఒకవైపు దాయాది దేశం పాకిస్తాన్, మరోవైపు చైనా ఆక్రమించుకుంటున్నాయన్నారు. ఇప్పటికే బ్రహ్మపుత్ర, సింధు నదుల ప్రవాహాన్ని ఆ దేశాలు ఆపుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం జరిగిన గురుపూజోత్సవంలో ఆయన ప్రధానోపన్యాసం చేశారు. ఎంతో సుసంపన్నమైన భారత భూమిని పరాయి దేశాలు ఆక్రమించుకోవడానికి నాటి పాలకులే కారణమని దుయ్యబట్టారు. 1962 నుంచి ఆక్రమణలు జరుగుతున్నా నాటి పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దౌత్య వ్యవస్థ, చైనా ఆక్రమణలు, లడఖ్ వంటి అంశాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే జనజాగరణ ఉద్యమం చేపడుతున్నామన్నారు. భారత సైన్యాన్ని బలోపేతం చేయాలని, వారికి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చాలని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. దేశ రక్షణకు సంబంధించి ఏడు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆ దేశం నాసిరకం వస్తువులతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు. హిందువులంతా హిందూ సంఘటనకు సమయం కేటాయించాలన్నారు. భగవత్ ధ్వజాన్ని డాక్టర్ జీ మాదిరిగా గురువుగా స్వీకరించి దేశానికి, ధర్మానికి రక్షణగా నిలవాలన్నారు. డాక్టర్ ఎ శివశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో విభాగ్ సహ సంఘచాలక్ మంతెన రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ఎస్ ఎపి ప్రాంత సహప్రచార ప్రముఖ్ వాసు