ఆంధ్రప్రదేశ్‌

వీడని ఆంత్రాక్స్‌పీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 2: విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ క్రమేణా విస్తరిస్తోంది. ఒక గ్రామంలో ప్రారంభమైన ఈ వ్యాధి లక్షణాలు మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తుండడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకులోయ మండలం కోడిపుంజువలస గ్రామానికి చెందిన మరో ఇద్దరికి, అరకులోయ సమీపాన పద్మాపురం గ్రామానికి చెందిన గిరిజనుడికి ఆంత్రాక్స్ లక్షణాలకు గురై కె.జి.హెచ్.లో చేరారు. పెదబయలు మండలం రాయిమామిడి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులు, బొండాపల్లి గ్రామానికి చెందిన ఒక గిరిజనుడు ఆంత్రాక్స్ లక్షణాలు బైటపడ్డాయి. తాజాగా పాడేరు మండలంలో కూడా ఈ వ్యాధి లక్షణాలు వెలుగుచూస్తున్నాయి. సరియాపల్లి గ్రామానికి చెందిన కోడా బొంజుబాబు అనే గిరిజనుడు ఆంత్రాక్స్ లక్షణాలతో బాధపడుతూ ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటి వరకు 12 మంది గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రికి చేరారు.