ఆంధ్రప్రదేశ్‌

జగన్ జిల్లాపై సిఎం గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 5: వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తరచూ ఆయన జిల్లా పర్యటనలు చేస్తూ ప్రభుత్వ పథకాల అమలుకు జిల్లాలోనే శ్రీకారం చుడుతున్నారు. గతనెల 25న జిల్లా పర్యటనకు వచ్చి రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో నీరు-చెట్టు, పంట సంజీవని, ఇంకుడు గుంతల తవ్వకాలను ప్రారంభించారు. మళ్లీ ఈ నెల 7వ తేదీన జిల్లాకేంద్రానికి చేరుకుని నాల్గవ విడత రైతు రుణమాఫీలో భాగంగా హామీ పత్రాలు అందజేయనున్నారు. ఉద్యానవన రైతులకు రుణ ఉపశమన పత్రాలు కూడా పంపిణీ చేయనున్నారు. గతనెల 20న ఒంటిమిట్టలో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 901 గ్రామాలకు నీటి ఎద్దడి తీర్చే మల్టివిలేజ్ స్కీమ్‌కు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా గండికోట పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా ప్రాబల్యం చాటుకున్న పార్టీ ఫిరాయింపుల తరువాత కూడా జిల్లాలో ప్రస్తుతం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైకాపా ప్రజాప్రతినిధులే ఉన్నారు. వారిలో కొంతమందినైనా ఆకర్ష్ పథకం కింద సైకిలెక్కించేందుకు ముఖ్యమంత్రి పర్యటనలు ఉపయోగపడతాయని అధికారపార్టీ జిల్లా నేతలు అంటున్నారు. ముఖ్యంగా గాలేరు-నగరి, హంద్రీ-నీవా, గండికోట, తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసి, వీలైనంత త్వరగా వాటిని పూర్తిచేస్తామని చెప్పుకొస్తున్నారు.