ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 3: చిత్తూరు జిల్లా పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కర్నాటకకు చెందిన హాజీ నాజిర్‌ను అరెస్టుచేసి, కారుతోపాటు నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నట్లు చిత్తూరు టాస్క్ ఫోర్సు డిఎస్పీ గిరిధర్ తెలిపారు. డిఎస్పీ కథనం మేరకు బెంగళూరు నగరానికి చెందిన హజీ నాజర్ (48) గత నాలుగేళ్లుగా దేశంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా పోలీసులుకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న హజీనాజిర్‌ను పట్టుకోవడానికి అనేకసార్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం కారులో బెంగళూరుకు వెళ్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో పెనుమూరు క్రాస్‌వద్ద చిత్తూరు రూరల్ సిఐ చంద్రశేఖ్‌ర్ అతన్ని పట్టుకొని కారుతోపాటు అందులో ఉన్న నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. హజినాజిర్ గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, 2014 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇతనికి తమిళనాడు, సేలంతోపాటు దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన బడా స్మగ్లర్లతో పరిచాయాలు ఉన్నట్లు చెప్పారు. అనతి కాలంలోనే అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగి, ఎర్రచందనం దుంగలను మలేషియా, దుబాయి దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇతనపై చిత్తూరు జిల్లాలో సుమారు 20 కేసులు నమోదు అయినాయని , ఇప్పటి వరకు సుమారు వెయ్యి టన్నుల వరకు ఎర్రచందనం దుంగలను అక్రమంగా ఎగుమతి చేసినట్లు డిఎస్పి తెలిపారు. ప్రస్తుతం ఇతన్ని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపుతామన్నారు.