ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో ఫార్ములా త్రీ కార్ రేసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 3: ఫార్ములా త్రీ... ఓ కలల ప్రాజెక్టు. ఇప్పుడు అమరావతి రేస్ రిసార్ట్ ప్రాజెక్టు రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో సాకారం అయ్యేందుకు ఫార్ములా త్రీ అయింది. రయ్యున దూసుకుపోయే కార్లు.. అందుకోసమే ప్రత్యేకంగా రూపొందించిన కిలోమీటర్ల ట్రాక్.. ఇప్పుడు పర్యాటకాంధ్రప్రదేశ్‌లో దర్శనం ఇవ్వబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఫార్ములా వన్ తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నం ఈ రూపంలో సఫలం కానుంది. ఇందుకోసం పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కోటపల్లి గ్రామంలో ఇందుకు అవసరమైన భూమిని గుర్తించగా, అమరావతి రేస్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి అనుమతి తీసుకునే క్రమంలో అన్ని పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తుండగా, దేశీయంగా నిధి మార్క్‌క్యూ ఒన్ మోటార్స్ ప్రాజెక్టుకు నేతృత్వం వహించనుంది. అంతర్జాతీయ స్థాయిలో డ్రైవెన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మోటార్ స్పోర్ట్ ఫార్ములా ఆపరేటర్స్ వంటి సంస్థల సహకారంతో ఈ ఫార్ములా త్రీ ప్రాజెక్టును పూర్తిచేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. సాధారణంగా ఫార్ములా వన్ స్థాయిలో కార్ల వేగం 350 నుండి 400 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉండగా, ఫార్ములా త్రీలో అది గంటకు 250 కిలోమీటర్లకే పరిమితం అవుతుంది. అమరావతి రేస్ ప్రాజెక్టులో దాదాపు 33 కిలోమీటర్ల మేర కార్ రేసింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ ం, కాన్ఫరెన్స్ సౌకర్యాలు, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో అత్యాధునిక సౌండ్ అండ్ లైటింగ్ షో వంటి పర్యాటక సౌకర్యాలు ఉంటాయి. మరోవైపు కార్ల పరిశ్రమకు సంబంధించిన వివిధ సంస్థల ఏర్పాట్లను సైతం ప్రోత్సహించేలా ప్రాజెక్టును సిద్ధం చేసినట్లు పర్యాటక కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. త్వరలోనే ప్రాజెక్టు నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకు వెళ్లనున్నామని, ఆయన అనుమతి మేరకు తదుపరి ప్రణాళిక ఉంటుందని తెలిపారు. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించటం ప్రధాన ధ్యేయంగా ఈ అమరావతి రేస్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
పర్యాటక ప్రాజెక్టుల వల్ల పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలన్న సిఎం ఆలోచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నాం, ఈ ఫార్ములా త్రీ ఏర్పాటు వల్ల దాదాపు 300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే రానున్న 18 నెలల్లో మొదటి దశ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. తద్వారా అనంతపురం జిల్లాలోని కోటపల్లి ప్రాంతం ఆర్థికంగా ముందడుగు వేస్తుందనటంలో సందేహం లేదని’ మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మొదటి దశ పూర్తయిన ఆరు నెలల వ్యవధిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్ రేస్‌లు ప్రారంభమవుతాయని వివరించారు.