ఆంధ్రప్రదేశ్‌

చేనేత కార్పొరేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్సీ సునీత విజ్ఞప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: ఇతర కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినట్లుగానే రూ.1000 కోట్లతో చేనేత కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో చేనేత ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేసింది. చేనేత వృత్తి గిట్టుబాటు కాక, ఇతర రంగాల్లోకి అసంఘటిత కార్మికులుగా వెళ్లిపోయిన చేనేత కుటుంబాలు తిరిగి చేనేత వృత్తిలోకి వచ్చే అవకాశం చేనేత కార్పొరేషన్ ద్వారా కలుగుతుందనీ, చేనేత కుటుంబాల చదువులకు, స్వయం ఉపాధికి కార్పొరేషన్ ఏర్పాటు అవసరం ఎంతో ఉన్నదని ముఖ్యమంత్రికి వివరించారు. సోమవారం ముఖ్యమంత్రిని వెలగపూడి సచివాలయంలో కలిసిన చేనేత ప్రతినిధుల బృందం.. చిలప నూలుపై, చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) నుంచి చేనేత రంగాన్ని మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రానికి లేఖ రాసినందుకు యావత్ చేనేతరంగం తరపున ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు.