ఆంధ్రప్రదేశ్‌

రాహుల్ దృష్టికి ‘గరగపర్రు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 3: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు సాంఘిక బహిష్కరణ అంశాన్ని కాంగ్రెస్ నేతలు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల నేతలు గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో మంగళవారం పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గ్రామాన్ని సందర్శించనున్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పే విషయమై ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఈ వివాదం నేపథ్యంలో తమను సాంఘిక బహిష్కరణ చేశారని దళితులు ఆరోపిస్తూ, ఆందోళనకు దిగగా, ఇదంతా కల్పితమని మరో వర్గం ఆందోళనలు చేస్తోంది. దీనితో కొద్ది రోజులుగా గ్రామాన్ని వివిధ పార్టీల నేతలు సందర్శించడం ప్రారంభించారు. బిజెపికి చెందిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె రాములు తొలిసారిగా అక్కడకు వచ్చి బహిరంగ విచారణచేసి బహిష్కరణకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా మంత్రి జవహర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు గ్రామాన్ని సందర్శించి, వెలి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్బంగ తహశీల్దార్, ఎస్సైలను సస్పెండ్ చెయ్యడంతో పాటు గ్రామ సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దుచేశారు. ఇక తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, బిజెపి నిజనిర్ధారణ కమిటీ పేరుతో ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు గ్రామంలో పర్యటించారు. కాంగ్రెస్, బిజెపి నేతల పర్యటనలకు మధ్య వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గరగపర్రు గ్రామంలోని రెండు వర్గాలను కలిసిమెలసి ఉండటానికి ఒక కమిటీ ఏర్పాటుచేశారు. ఈ వెలి అంశం ఒక కొలిక్కి వచ్చి పరిష్కారమవుతుందని అంతా భావించారు. కాని ఆ దిశగా అడుగులు పడలేదు. ఇక వ్యవహారం రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఆలిండియా ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు తదితరులు మంగళవారం గ్రామంలో పర్యటించనున్నారు. మరోపక్క దళిత, అంబేద్కర్ సంఘాలు ఈ వెలి అంశం పై చలో ఢిల్లీ కార్యక్రమానికి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద గరగపర్రు వెలి అంశం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. సందర్శిస్తున్న నేతలందరికీ జరిగిన ఘటనను వివరిస్తున్న బాధితుల్లో కొంత విసుగు కనిపిస్తోంది.