ఆంధ్రప్రదేశ్‌

మీరా కుమార్ స్పీకర్‌గా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: యుపిఏ అభ్యర్థిగా రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న మీరా కుమార్ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడే పార్లమెంటు తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ బిల్లు ఆమోదించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అటువంటి మీరాకుమార్ పోటీ చేస్తే తాము ఎందుకు మద్దతునివ్వాలని భూమన ప్రశ్నించారు. వైఎస్సార్ పేరును ఉచ్చరించే అర్హత కూడా కాంగ్రెస్‌కు లేదన్నారు. టిడిపితో ఎంత దూరంగా ఉన్నామో, కాంగ్రెస్‌కూ అంతే దూరంగా ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈజిప్టు మమీ రెండూ ఒకటేనని అన్నారు. కుక్కలు చించిన విస్తరిలా ఉన్న కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని అన్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో పోటీ చేయడం సంప్రదాయం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారని చెబుతూ ఆ సీటులో 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గెలుపొందినందున, టిడిపి పోటీ చేయకుండా ఉండాల్సిందని భూమన తెలిపారు.