ఆంధ్రప్రదేశ్‌

9న శాకాంబరిగా భ్రమరాంబిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జూలై 3: ఆశాడ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 9న శ్రీశైల భ్రమరాంబికకు శాఖంబరి అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అలంకరించనున్నారు. ఆ రోజున అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. శ్రీ భ్రమరాంబదేవి మూలవిరాట్, ఆలయ ప్రాంగణంలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి, సప్తమాతృకలు, గ్రామ దేవత అంకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారిని కాయలు, ఫలాలతో అర్చించడం వల్ల అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో వర్షాలు కురిసి కరవుకాటకాలు దూరమవుతాయి. లోక కల్యాణంకోసం ప్రతి సంవత్సరం ఆశాడ పౌర్ణమి రోజున శాకాంబరి ఉత్సవం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు తన తపశక్తితో వేదాలను అంతర్థానం చేయడంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. కరవు కాటకాలతో క్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులంతా ఆది పరాశక్తిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేశారు. మునుల తపస్సుకు ఆది పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడును సంహరించి, వేదాలను రక్షించి, వైదికకర్మలను పునరుద్దరింపచేసింది.
జగన్మాత వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలతో శాఖలను సృష్టించి క్షామాన్ని నివారించిందని, అందువల్లనే పరాశక్తి స్వరూపానే్న శాకాంబరి దేవిగా ఆశాడ పౌర్ణమి రోజున అలంకరించి అర్చించే సంప్రదాయం వచ్చింది. దేవతామూర్తులకు అలంకరించేందుకు కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలను అందించేందుకు దేవస్థానం ఉద్యానవన విభాగం సహాయ డైరెక్టర్‌ను సంప్రదించాలని ఇఓ తెలిపారు.