ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో 7నుంచి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: ఈ నెల 7 నుండి 9వ తేదీవరకు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో శాకాంబరీదేవి మహోత్సవాలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవతగా ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వివిధ రకాలైన కూరగాయాలనే ఆభరణాలుగా ధరించి శాకంబరీదేవిగా భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం సంప్రదాయంగా ఆషాడ మాసంలో శుద్ధ త్రయోదశి 7వ తేదీ నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 9 వరకు మూడు రోజులు పాటు దుర్గమ్మ ఈ ప్రత్యేక అలంకారంతో భక్తులకు దివ్యదర్శనం ఇవ్వనున్నారు. అమ్మవార్లకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజైన శుక్రవారం ప్రారంభమై ఈ ఉత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో ముగుస్తాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అంతరాలయంలోని మూల విరాట్‌తోపాటు ఆలయ ప్రాంగణం, ఉపాలయాల్లో కొలువై ఉన్న దేవతా మూర్తులకు సైతం వివిధ కూరగాయాలతో ప్రత్యేకంగా అలంకణ చేస్తారు. దీనికి సంబంధించిన సకల ఏర్పాట్లు ఇప్పటికే దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది పనులు చేపట్టారు.