ఆంధ్రప్రదేశ్‌

ఆపరేషన్ చేయించుకుంటే.. ఉన్న చూపు పోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, జూలై 3: ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో శస్తచ్రికిత్సలు చేయించుకున్న పలువురు కంటిచూపు కోల్పోయినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో శస్తచ్రికిత్సలు జరగగా, అప్పటినుంచి బాధితులు సదరు ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ చివరకు విలేఖర్ల ముందుకొచ్చారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివార్లలోని కంటి ఆసుపత్రిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో పేదలకు ఉచితంగా కంటి శస్తచ్రికిత్సలు నిర్వహించారు. మొత్తం 11 మందికి శస్తచ్రికిత్సలు చేయగా అందులో 9 మంది చూపు కోల్పోయారు. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు, సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన ఏడుగురు, జగ్గంపేట మండలం జె కొత్తూరుకు చెందిన (బాలరాజు) కంటి ఆపరేషన్లు చేయించుకున్నారు. అయితే కొద్దిరోజులకే వీరిలో తొమ్మిది మందికి ఆపరేషన్ చేసిన కంటి చూపు కోల్పోవడంతో తిరిగి ఆసుపత్రికి వెళ్లారు. దీంతో విజయవాడలోని ఒక కంటి ఆసుపత్రికి వెళ్లమని నిర్వాహకులు వారికి సూచించారు. అక్కడికి వెళ్లిన బాధితులు రూ.2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో చేసేదిలేక తిరిగి వచ్చారు. తమకు ఆపరేషన్లు చేసిన ఆసుపత్రికి వెళితే, చుక్కల మందు వేసే ఇంటికి పంపించేవారని బాధితులు తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో విశాఖపట్నం ఎల్‌వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అక్కడ కూడా ప్రయోజనం లేకపోవడంతో బాధితులను కాకినాడ ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసి తమను ఇంటికి పంపించి వేశారని, తిరిగి తమను మళ్లీ వైజాగ్ తీసుకెళ్లగా కంట్లో నరాలు పనిచేయడం లేదని అక్కడి వైద్యులు సర్ట్ఫికెట్ ఇచ్చారని బాలరాజు అనే బాధితుడు వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం
సామర్లకోట: కాగా ఈ ఘటనలో సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన అయిదుగురు కంటి చూపు కోల్పోయారు. ఈ వ్యవహారాన్ని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు వేట్లపాలెం గ్రామ ఉప సర్పంచ్ వల్లూరి శ్రీనివాసరావు చెప్పారు.