ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, జూలై 3: ఏజెన్సీలో వైద్య సేవలు విస్తృత పరచడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. భారీగా జ్వర మరణాలు సంభవించిన తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గ్రామస్థులను కోడెల పరామర్శించారు. గ్రామంలో అనారోగ్యంతో మరణాలు సంభవిస్తుంటే ఎందుకు బయటకు చెప్పలేదంటూ చాపరాయి గ్రామస్థులను ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్ కోడెల స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో రహదారులు, పాఠశాలలు, వౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. చాపరాయి ఘటనలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పిఒ దినేష్‌కుమార్ స్పందించిన తీరు అభినందనీయమన్నారు. ఏజెన్సీలో కలుషిత నీరు తాగడంవల్లే గిరిజనులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. చాపరాయిలో 16మంది మృతికి కారణం కూడా కలుషిత నీరు తాగడమేనన్నారు. ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఏర్పాటుచేస్తే పిల్లల్లో పౌష్టికాహారం లోపాన్ని చక్కదిద్దడంతోపాటు, విద్యాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, రంపచోడవరం ఎఎస్పీ అస్మీ, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్ పాల్గొన్నారు.

చిత్రం.. చికిత్స పొందుతున్న చాపరాయి గిరిజనులను పరామర్శిస్తున్న స్పీకర్ కోడెల