ఆంధ్రప్రదేశ్‌

చాపరాయి మరణాలు జాతీయ విపత్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, జూలై 3: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన చాపరాయిలో గిరిజనుల మరణాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే సంభవించాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్ష్యుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఒకే గ్రామంలో 20 రోజుల వ్యవధిలో 16 మంది గిరిజనులు జ్వరాలతో మృతిచెందడం జాతీయ విపత్తేనని అన్నారు. వైరామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో ఇటీవల జ్వరాలతో మృతిచెందిన 16మంది కుటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. మృతిచెందిన గిరిజన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5000 వంతున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో నివసించే గిరిజనులను ద్వితీయ శ్రేణి పౌరులుగా ప్రభుత్వం పరిగణిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన రక్షిత మంచినీటి పథకాలను మూలనపెట్టారని, కనీసం వారికి సురక్షిత నీటిని ప్రభుత్వం అందించలేకపోతోందని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు వంతున పరిహారం ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్ చేస్తే, కేవలం రూ.5 లక్షలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అది కూడా ఇంకా అందించలేదని రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. చాపరాయి బాధితులకోసం ఢిల్లీ వరకూ పోరాటం సాగిస్తామన్నారు. జరిగిన విపత్తును జాతీయ మానవ హక్కుల సంఘానికి తెలియపరుస్తామని రఘువీరా పేర్కొన్నారు. అలాగే జాతీయ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదుచేస్తామన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని అయన పరిశీలించారు. అనారోగ్య పరిస్థితులపై వైద్యులను ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం, మాజీ ఎమ్మేల్యే పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నేతలు పంతం నానాజీ, ఆకుల రామకృష్ణ, పి.హరికృష్ణ, దంగేటి సత్తిబాబు, మారేడుమిల్లి మాజీ సర్పంచ్ దూడ రమణరావు, మండల అధ్యక్షులు ఎన్ రామరెడ్డి, పాల్‌బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. చాపరాయి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న రఘువీరారెడ్డి, జెడి శీలం తదితరులు