ఆంధ్రప్రదేశ్‌

43 రోజుల్లో పురుషోత్తపట్నం రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 3: ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల్లో కనీసం నాలుగు పంపుల ద్వారా అయినా నీటిని వదిలి ఏలేరు రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈనెల మూడో సోమవారం పురుషోత్తపట్నం పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని చెప్పారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం, పురుషోత్తపట్నం సహా రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వర్షాలు ఎక్కువగా కురవడం, గోదావరికి ఇన్‌ఫ్లో పెరగడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు కొంతమేర ఆటంకం కలిగినట్టు సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. గడిచిన వారంలో స్పిల్ చానల్, లెప్ట్ ఫ్లాంక్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్‌కు సంబంధించి 3.23 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల వివరాలను ఆయా జిల్లాల అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రానున్న రెండు వారాల్లో రాష్ట్రంలో వానలు తగ్గుముఖం పడతాయని షార్ అధికారులు తెలుపగా, దీన్ని అవకాశంగా తీసుకుని ప్రాజెక్టుల పనులు ముమ్మరం చేయాలనిసూచించారు. అలాగే మున్ముందు పంటలను కాపాడేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

చిత్రం.. సాగునీటి ప్రాజెక్ట్‌లపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు