ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయానికి త్వరలో పగలు విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 4: ‘మనం చరిత్రలో ఎవరూ చేయనన్ని మంచి పనులు చేశాం. ఇంకా చేస్తున్నాం. కానీ చేసిన పనులు చెప్పడంలో వెనుకబడ్డాం. మనం వౌనంగా ఉంటే మనం ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఈ ప్రతిపక్షంతో జాగ్రత్తగా ఉండండి. మరో మూడునెలల్లో 24 ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. అప్పుడు ఇక కరవు సమస్య పెద్దగా ఉండదు. ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలి. కొందరు మాత్రమే 80శాతం ప్రచారం చేస్తూ కొత్త కార్యక్రమాలు చేసుకుపోతున్నార’ని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడ ఏ కనె్వన్షన్ సెంటర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జ్‌లతో నిర్వహించిన పార్టీ వర్క్‌షాప్‌లో చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో వ్యవసాయానికీ పగటిపూట విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. రుణమాఫీలో ఇప్పుడు దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, అన్ని రాష్ట్రాల వారు అధ్యయనానికి మన వద్దకు వస్తున్నారన్నారు. యుపి, తెలంగాణలో లక్ష రూపాయలు మాఫీ చేస్తే మనం లక్షన్నర మాఫీ చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 11 లక్షల ఇళ్లు కడుతున్నామని, ఒక్క నంద్యాలలోనే 400 ఎకరాల్లో 13 వేల ఇళ్లు కడుతున్నామని, విశాఖ గాజువాకలో 30 వేల మందికి మహిళల పేరిట పట్టాలిచ్చామని గుర్తుచేశారు. చుక్కల భూముల సమస్యలనూ పరిష్కరించామని చెప్పారు. పింఛన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, చంద్రన్న బీమా, గ్యాస్ సిలెండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు సంతృప్తికర స్థాయిలో అమలుచేస్తున్నా దానికి తగినంత పొలిటికల్ మైలేజీ రావడం లేదన్న ఆవేదన బాబు మాటల్లో స్పష్టంగా కనిపించింది. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఆదరించాల్సిన బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. ‘గతంలో దయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేవి. ఇప్పుడు ఎక్కడా అవినీతి లేకుండా అర్హులైన అందరికీ పింఛన్లు ఇచ్చాం. మనం ఇంత చేస్తున్నా మీరు ప్రజల వద్దకు వెళ్లి మోటివేట్ చేయడం లేదు. అలాచేస్తే 80శాతం అనుకూలత వస్తుంద’ని అన్నారు. హౌసింగ్ స్కీములో అవకవతకలు జరగకుండా చూడాలని, అది జరిగితే చెడ్డపేరు వస్తుందని హెచ్చరించగా, అవి కింది స్థాయి కార్యకర్తల్లో జరిగే అంశాలని ఓ ఎమ్మెల్యే ప్రస్తావించారు. దానికి స్పందించిన బాబు కార్యకర్తలు ఆ పనిచేసినా పార్టీకి కింది స్థాయిలో చెడ్డపేరు వస్తుందన్నారు. పట్టిసీమ ద్వారా నదులను అనుసంధానం చేశామని, పెన్నా-గోదావరి నదులను కూడా అనుసంధానం చేయనున్నామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం పూర్తిచేసి ఏలేరుకు నీరిస్తామన్నారు. తొలిసారిగా జూలైలోనే కృష్ణా డెల్టాకు నీరిచ్చామన్నారు. తొలిదశ విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చింది తానేనని, ఇప్పుడు రెండో దశ సంస్కరణల ఫలితంగా వచ్చే ఏడాది నుంచి విద్యుత్ చార్జీలు తగ్గనున్నాయన్నారు. మిగులు విద్యుత్ అందుబాటులో ఉన్నందున త్వరలో వ్యవసాయానికీ పగటిపూట విద్యుత్ ఇవ్వనున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సదావర్తి భూముల విషయం విపక్షాలు ఏవిధంగా రాజకీయం చేశాయో చూశామన్నారు. దానిపై మనం చెప్పిందే ఇప్పుడు హైకోర్టు చెప్పిందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమలుతో కొంత ఇబ్బంది ఉందని, సాగునీటి ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం ఉందన్నారు. వర్క్‌షాప్ మధ్యాహ్న భోజనం తర్వాత ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు స్వయంగా సమాధానాలిచ్చారు. తమ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలు, మండలాల్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపేందుకు ఒక యాప్, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు.
కోవింద్‌కు స్వయంగా స్వాగతం
వర్క్‌షాప్ మధ్యలో గన్నవరం విమానాశ్రాయానికి వెళ్లిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థి రామనాథ్ కోవింద్‌కు స్వయంగా స్వాగతం పలికి ఆయనతో కలిసి వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. అనంతరం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఆయన కోవింద్‌కు పరిచయం చేశారు.