ఆంధ్రప్రదేశ్‌

కోవిందుడు అందరివాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 4: రాష్టప్రతి పదవికి ఈ నెల 17న జరగనున్న ఎన్నికలో అధికార ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అందరివాడు కానున్నారు. అధికార తెలుగుదేశం, ప్రతిపక్షమైన వైస్సార్‌సీపీకి చెందిన శాసనసభ్యులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల ఓట్లన్నీ గంపగుత్తగా ఆయనకే పోల్‌కానున్న విచిత్ర రాజకీయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రెండు పార్టీలూ ఆయనకు మద్దతు ప్రకటించడమే ఇందుకు కారణం. రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం పార్టీకి 127 మంది సభ్యులుండగా, వైస్సార్‌సీపీకి 47 మంది ఉన్నారు. టిడిపికి ఆంధ్ర, తెలంగాణలో ఐదుగురు రాజ్యసభ సభ్యులు, 18మంది లోక్‌సభ సభ్యులున్నారు. వైసీపీకి ఏడుగురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యుని బలం ఉంది. నంద్యాల సీటు ఖాళీ కావడంలో మొత్తం 175 స్థానాల్లో 174 మంది శాసనసభ్యులు ఎన్డీఏ అభ్యర్థికే గంపగుత్తగా ఓటేయనున్న పరిస్థితి తొలిసారి కనిపిస్తోంది. ఈవిధంగా అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి ఒకే అభ్యర్థికి ఓటు వేస్తున్న వైచిత్రి కూడా తొలిసారిగా దర్శనమిస్తోంది. కాగా, రాష్ట్ర విభజన క్రమంలో రాజ్యసభ సభ్యులకు రాష్ట్రాలు కేటాయించిన సందర్భంలో తెలంగాణకు చెందిన టిడిపి రాజ్యసభ సభ్యుడైన దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ ఎంపి రేణుకాచౌదరి ఏపికి వెళ్లగా, ఏపికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, టిడిపి సభ్యుడైన సీఎం రమేష్ తెలంగాణకు అలాట్ అయ్యారు. ఆతర్వాత రాజ్యసభ సభ్యుల నిధులను వారివారి సొంత రాష్ట్రాలకు వినియోగించుకునే వెసులుబాటు మాత్రం వీరికి కల్పించారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో రాష్టప్రతి ఎన్నిక సందర్భంగా ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 148గా ఉండగా, విభజన తర్వాత తెలంగాణలో 132, ఏపికి 159గా నిర్ణయించారు. ఇదిలావుంటే, ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యే, ఎంపీల ఓట్ల వినియోగానికి సంబంధించి రెండు ఫారాలు పంపినట్లు శాసనసభ కార్యాలయ వర్గాలు చెప్పాయి. ఆ ప్రకారంగా సదరు ప్రజాప్రతినిధి తన ఓటు విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీలలో ఎక్కడ వినియోగించుకుంటారో ముందుగా ఎంపిక చేసుకోవాలి. కాగా, ఏపిలోని విజయనగరం జిల్లా ఎమ్మెల్యే ఒకరు తన ఓటును ఢిల్లీ, విజయవాడలో వినియోగించుకుంటానని రెండు ఫారాల్లో పేర్కొనడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో టిడిఎల్పీ కార్యాలయం జరిగిన విషయం తెలుసుకుని, తన ఓటుహక్కు విజయవాడలోనే వినియోగించుకుంటానని మరో ఫారంలో ఆయనతో సంతకం చేయించి పంపించారు. కాగా, ఎపి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు చిరంజీవి, టి సుబ్బరామిరెడ్డి, రేణుకాచౌదరి ఓట్లు మాత్రం యుపిఏ అభ్యర్థి మీరాకుమార్‌కు పడనున్నాయి.