ఆంధ్రప్రదేశ్‌

రేషన్ డీలర్లకు బీమా ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: రాష్ట్రంలోని 29వేల మంది రేషన్ డీలర్లకు కార్పస్ ఫండ్ నుండి క్రియాశీలక సభ్యత్వం ద్వారా బీమా సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం విజయవాడలోని రాష్ట్ర అతిథిగృహంలో రేషన్ డీలర్లు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కల్పించేందుకు రాజస్థాన్ తరహాలో బియ్యంతో పాటు ఇతర సరుకులను అమ్మించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌లో అమలు చేసే విధానంలో ఇస్తున్న కమీషన్ ఇక్కడా ఇప్పించాల్సిందిగా డీలర్లు మంత్రిని కోరారు. డీలర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముద్రా రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. డీలర్లకు అదనపు ఆదాయం కల్పించే జీవో అమలు చేసి తమ మనుగడకు సహాయపడాల్సిందిగా కోరారు. ఇప్పడు ఇస్తున్న 1 శాతం కమీషన్‌ను 10 శాతానికి పెంచాలన్నారు. మంత్రి పుల్లారావు స్పందిస్తూ డీలర్ల సమస్యలను పరిష్కరించి రవాణా, కమీషన్ బిల్లులను త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి తూకం వేసి ఇస్తేనే డీలర్లు డెలివరీ తీసుకోవాలని, లేకపోతే తిరస్కరించాలని సూచించారు. డీలర్లను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. డీలర్లు ఎక్కడైనా తప్పుచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. డీలర్ల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పౌర సరఫరాల సంస్థ ఎండి రాంగోపాల్, డైరెక్టర్ రవిబాబు, జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సంఘం సభ్యులు దివి లీలామాధవరావు, ఆర్ గంగాధర్, కాగిత కొండ, గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.