ఆంధ్రప్రదేశ్‌

లక్ష్యాల సాధనలో ‘ఈస్ట్రన్’ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: బహుళ ప్రయోజనాల సోలార్ వ్యవసాయ పంపుసెట్లకు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వీటిని వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసుకునేందుకు రైతులు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నారు. సోలార్ వ్యవసాయ పంపుసెట్లను మరింతంగా విస్తరించేందుకు ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడిసిఎల్) ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా రైతులకు జిల్లావారీగా వీటి వాడకం ద్వారా కలిగే బహుళ ప్రయోజనాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఫలితంగా ఐదు జిల్లాలకు సంబంధించి 9,688 మంది రైతులు సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 5హెచ్‌పి సామర్థ్యం గల సోలార్ వ్యవసాయ పంపుసెట్ల కోసం 8,710 మంది, 3హెచ్‌పి సామర్థ్యం గల పంపుసెట్లకు సంబందించి మరో 978 మంది రైతుల నుంచి సంస్థకు దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించాక ఇందులో 8,455 దరఖాస్తులు అర్హత కలిగినవిగా ప్రకటించింది. వీటిలో 5హెచ్‌పి పంపుసెట్లకు సంబంధించి 7,587, 3హెచ్‌పి పంపుసెట్ల కోసం ము 868 దరఖాస్తులు అర్హతగా నిలిచాయి. దీంతో మంజూరైన వీటికి యుద్ధప్రాతిపదికన ఆయా జిల్లాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసుకునేందుకు సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 5,892 పంపుసెట్లు ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. మిగిలిన సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు ఐదు జిల్లాలకు సంబంధించి అధికారులను ప్రత్యేక బృందాలుగా నియమించి యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ నాయక్ ఆదేశించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సోలార్ వ్యవసాయ పంపుసెట్ల ఏర్పాటులో ప్రథమ స్థానంలో నిలిచాయన్నారు. సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసుకోవడం వలన ఇంధన పొదుపును సాధించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. దీనివల్ల సంస్థకు ప్రతి ఏడాది డిమాండ్‌ను తట్టుకునే వీలుంటుంది.