ఆంధ్రప్రదేశ్‌

క్షమాపణ లేఖను స్పీకర్ పరిశీలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శాసనసభ నుంచి సస్పెన్షన్ వ్యవహారంలో ఆమె ఇచ్చిన క్షమాపణ లేఖను అసెంబ్లీ స్పీకర్ పరిశీలనలోకి తీసుకుని పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. గతంలో రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అమితావ్‌రాయ్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషన్ తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ రోజాపై విధించిన సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీలో జరిగిన ఘటనలకు సంబంధించి స్పీకర్‌కు రోజా లేఖ ఇచ్చారని, కాని స్పీకర్ ఈ అంశాన్ని పరిష్కరించలేదని కోర్టుకు వివరించారు. ఎమ్మెల్యే సస్పెన్షన్ కాల వ్యవధి కూడా అయిపోయిందని తెలిపారు. అయితే ప్రతివాది తరపు న్యాయవాది ప్రేర్నా సింగ్ వాదిస్తు స్పీకర్‌కు రాసిన లేఖ అందలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రోజా స్పీకర్‌కు రాసిన లేఖను ప్రతివాది న్యాయవాదికి ఇవ్వాలని రోజా తరపు న్యాయవాదికి సూచించారు. అలాగే దీనికి సంబంధించిన పిటిషన్ ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, అక్కడకి వెళ్లాలని రోజా తరపు న్యాయవాదికి సూచించారు. శాసన సభ స్పీకర్ ఈ లేఖను పరిగణలోకి తీసుకుని ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని ఆదేశించారు.